తొక్కిసలాట జరిగి అమాయకులు చనిపోవడం బాధాకరం: తలుపుల లో సీఎం చంద్రబాబు నాయుడు
తొక్కిసలాటలో అమాయకులు చనిపోవడం బాధాకరం, చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నానని తలుపులలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాశీబుగ్గలో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర ఆలయం నిర్మించారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో, ఎక్కువ మంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. అయితే నిర్వాహకులు కనీసం పోలీసులకు గానీ, అధికారులకు గానీ సమాచారం ఇవ్వలేదు. ఒక్క ప్రాణం కూడా పోకూడదని ప్రభుత్వం కృషి చేస్తుండగా, ప్రైవేటు కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుని అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము.