జమ్మలమడుగు: ధర్మాపురం :గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంటను పరిశీలించిన తెదేపా ఇంచార్జి భూపేష్ రెడ్డి
కడప జిల్లా జమ్మలమడుగు మండలం ధర్మాపురం, గొరిగనూరు గ్రామాలలో బుధవారం నియోజకవర్గ తెదేపా ఇంచార్జి భూపేష్ సుబ్బరామిరెడ్డి మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంటను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారికి ఎక్కడైతే పంట దెబ్బ తినిందో అక్కడికి వెళ్లి పరిశీలించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లికార్జున, జిల్లా అధికార ప్రతినిది శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.