ఏలూరుజిల్లా కామవరపుకోట తహశీల్దార్ కార్యాలయం వద్ద నాయక కులస్తులు చేస్తున్న నిరసన దీక్ష సెలవు రోజు అయినప్పటికీ ఆదివారం ఏడవరోజు కొనసాగించారు. ఏడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని కొమరం భీమ్ నాయక కులస్తుల సంఘం నాయకులు పేర్కొన్నారు. అధికారులు ఇదే విధంగా ఉంటే త్వరలోనే ఆమరణ నిరాహారదీక్ష చేయటానికి సైతం సిద్ధమని వారు పేర్కొన్నారు.