సంగారెడ్డి: సంగమేశ్వర ఆలయం, శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో భక్తిశ్రద్ధలతో జ్వాలాతోరణం మహోత్సవం
కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఆలయాల్లో జ్వాలా తోరణం బుధవారం రాత్రి వైభోపితంగా నిర్వహించారు. బుధవారం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని సంగమేశ్వర స్వామి దేవాలయం, ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో భక్తిశ్రద్ధలతో జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామస్మరణ చేశారు. ఉత్సాహంగా భక్తులు మూడుసార్లు జ్వాలాతోరణం కింద నుంచి నడుచుకుంటూ వెళ్లారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ఆలయాల్లో శివనామస్మరణతో మార్మోగాయి.