పోలీసు ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది : సీఐ ఏవి రమణ
Gudur, Tirupati | Oct 25, 2025 పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వెంకటగిరిలో శనివారం బ్యాండ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించారు. సీఐ ఏవీరమణ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం కత్తిమీద సాము లాంటిదన్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు చేసే ఉద్యోగం కాదన్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు విధులకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.