నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో శనివారం రాత్రి కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ,జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ ఆదేశాల మేరకు టౌన్ ఎస్ఐ జయప్ప ప్రజలకు, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు, సైబర్ క్రైమ్ ఫై, హెల్మెట్ ఆవశ్యకతపై, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు.