యాంకర్ వాయిస్... పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని మార్కాపురం జిల్లా కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున అన్నారు. కంభం మండలంలోని కంభం చెరువు కట్టపై ఎస్ఐ శివకృష్ణారెడ్డి, సీఐ మల్లికార్జున పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు మరి పోలీసు సిబ్బందితో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరువు కట్ట పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేసి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కంభం చెరువు కట్ట పరిసర ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు.