వట్లూరులో నాగేశ్వరమ్మ అనే మహిళపై కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించిన గుర్తు తెలియని వ్యక్తి
Eluru Urban, Eluru | Sep 14, 2025
ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా వట్లూరు గ్రామంలో సింగం శెట్టి నాగేశ్వరమ్మ స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంది. ఇది ఇలా ఉండగా ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు గుర్తు తెలియని ఒక యువకుడు నాగేశ్వరమ్మ దుకాణం వద్దకు వచ్చి కూల్ డ్రింక్ కావాలని అడిగి 100 రూపాయల నోట్ ఇచ్చినట్లే ఇచ్చి తనతో తెచ్చుకున్న చాకుతో విచక్షణా రహితంగా దాడి కి పాల్పడ్డాడు. దాడి అనంతరం నాగేశ్వరమ్మ ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసుకుని అక్కడినుండి పారిపోయాడు అగంతకుడు. కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న నాగేశ్వరమ్మను హుటా హుటీన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు