సూపర్ సేవింగ్స్ సూపర్ జీఎస్టీ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలి: జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
Ongole Urban, Prakasam | Oct 19, 2025
సూపర్ సేవింగ్స్ సూపర్ జిఎస్టి కార్యక్రమంలో ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దీపావళి పండుగ సందర్భంగా ముందస్తు దీపావళి వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని జాయింట్ కలెక్టర్ అన్నారు. అలానే జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం పై అవగాహన కల్పించామని ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.