గుడివాడ బస్టాండ్‌లో వర్షపు నీరు
Machilipatnam South, Krishna | Sep 23, 2025
గుడివాడలో ఇటీవల కురిసిన వర్షాలకు బస్టాండ్ ఆవరణలో మురుగునీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా బస్టాండ్‌లోకి వెళ్లడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, మురుగు నీటిని తొలగించి, కొత్త బస్టాండ్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.