ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గోగులదీన్నే గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను రాజును చేసేందుకు ఐదు విధానాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. 65 రోజులపాటు పోరాటాల ఫలితంగా మార్కాపురం జిల్లా వచ్చిందని దానికి ప్రాంత ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు కు రుణపడి ఉంటామన్నారు.