రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న మహిళలకు ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్న ఆటో, రవాణా కార్మికులను ఆదుకోవాలని శుక్రవారం అనకాపల్లి జిల్లా రాజాంలో ఆటో కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పథకం ప్రవేశ పెట్టడం ద్వారా ఆటో కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఇప్పటికే ఆటో సర్వీసులు తగ్గాయన్నారు.