మలక్పేట డీ-మార్ట్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. పిల్లర్ నంబర్ A-1460 వద్ద ఓ ఆటో టైర్ పేలడంతో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి రెండు ఆటోలను బలంగా ఢీకొంది. ఆ సమయంలో ఆటోల్లో చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.