పెనుకొండ వద్ద రోడ్డు ప్రమాదం
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు వైపు నుంచి వస్తున్న కారు టైర్ బ్లాస్ట్ కావడంతో బోల్తా కొట్టింది. జాతీయ రహదారిపై నుంచి కిందకు గుంతలోకి పడిపోవడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.