తాడిపత్రి: దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాడిపత్రిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన బిజెపి నేతలు
దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాడిపత్రి పట్టణంలో బిజెపి నేతలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు అందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రోగులబంధువులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వృద్ధులకు చంటి బిడ్డల తల్లులకు పాలు బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ నెంబర్, కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ అంకాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మైదుకూరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.