నాయుడుపేటలో పిడుగుపాటుతో యువకుడు మృతి
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కలిపేడు పంచాయతీ పరిధిలోని గంగమ్మ కట్ట వద్ద శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు గ్రామానికి చెందిన అదురు శివయ్యగా గుర్తించారు. గ్రామ సమీపంలోని పొలాల వద్ద పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యాడు. శివయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.