తాడిపత్రి: పెద్దవడుగూరు మండలంలోని వీరన్న పల్లి లోని ఆలయంలో నంది విగ్రహం చోరీ, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పెద్దవడుగూరు మండలం వీరన్న పల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి ముఖద్వారం వద్ద ఉన్న నంది విగ్రహం చోరీకి గురైంది. గుర్తు తెలియని దొంగలు దేవాలయంలోకి ప్రవేశించి నంది విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.