భార్యను హత్య చేసిన ముద్దాయి కోసం : ఆళ్లగడ్డ రూరల్ మురళీధర్ రెడ్డి గాలింపు
ఆళ్లగడ్డ మండలం కృష్ణాపురంలో జరిగిన ఓలమ్మ అనే వివాహిత హత్య కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తన భార్య అక్రమ సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో నిందితుడు శేషగిరిరావు తన భార్య ఓలమ్మను ఇటుకలతో తలపై కొట్టి, భవనం పైనుంచి తోసి హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ముద్దాయి కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు.