తాడిపత్రి: తాడిపత్రిలోని రైల్వే స్టేషన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ను కలిసిన ఆ పార్టీ తాడిపత్రి నేతలు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తాడిపత్రి మీదుగా నంద్యాలకు వెళుతున్న సందర్భంగా సిపిఐ నేతలు తాడిపత్రిలో మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో విజయవాడ నుంచి నంద్యాలకు వెళ్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను ఆ పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీరాములు నాగేంద్ర శివ రైతు సంఘం నేత పుల్లయ్య రైల్వేస్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాడిపత్రిలో జరుగుతున్న రాజకీయాలపై రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు నేతలు వివరించారు. ముఖ్యంగా యూరియా సమస్యపై రామకృష్ణకు నేతలు తెలిపారు.