జమ్మలమడుగు: బద్వేల్ : గోపవరం మండలాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని బద్వేలు, గోపవరం మండలాల పరిధిలో మెంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల పొలాలను గురువారం బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పరిశీలించారు. గుండంరాజుపల్లి, కాలువ పల్లె గ్రామాల్లో పర్యటించి ఈ అకాల తుఫాన్ వల్ల నష్టపోయిన వరి మరియు ఇతర పంటలను పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వెంటనే గ్రామ గ్రామాన తిరిగి నష్టపోయిన ప్రతి పంటను వెంటనే ఎన్యూమరేట్ చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను విస్మరించి పూర్తిగా పెత్తందారులకు అనుకూలంగా పనిచేస్తున్నదని విమర్శించారు. జగనన్న ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు.