హిమాయత్ నగర్: బన్సీలాల్ పేటలోని స్మశాన వాటిక స్థలం కురుమ సంఘానికి సంబంధించినది : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
బన్సీలాల్ పేటలోని స్మశాన వాటిక స్థలంలో అక్రమంగా బహులంతస్తుల భవనం నిర్మిస్తున్నారని కురుమ సంఘం సభ్యులు నిరసనలు చేస్తుండడంతో ఆ స్థలాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్మశాన వాటిక స్థలం కురుమ సంఘానికి సంబంధించినదేనని ఎమ్మెల్యే అన్నారు. కోర్టు వివాదం ముగిసిన వెంటనే ఆ స్థలాన్ని కురుమ సంఘానికి అప్పగిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.