కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కారు ప్రమాదాన్ని ఆసరాగా తీసుకొని పది లక్షలు ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితుడు ముదావత్ శంకరును ఆటోడ్రైవర్ గా గుర్తించారు. మరో నిందితుడు అభినయ్ పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు గాలింపులు చేపట్టాయి. నిందితుడు దొంగిలించిన నగదు పదిలక్షల్లో 5.32 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.