రాయదుర్గం: పట్టణంలోని పలు వార్డుల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించిన టిడిపి నాయకులు
రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్వచ్ఛత కార్యక్రమంలో శ్రమదానం చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి పురష్కరించుకుని CM చంద్రబాబు ఆదేశాలతో 'ఏక్ దిన్ ఏక్ గంటే' అంటూ స్వచ్ఛత చేపట్టారు. 9,6,13,22 వార్డుల్లో పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో పరకపట్టి శుభ్రం చేశారు. 9వ వార్డులో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోరాల పురుషోత్తం పాల్గొన్నారు.