వర్ని: వర్ని మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వర్ని: మండల కేంద్రంలోని విఎంఆర్ ఫంక్షన్ హాల్ వద్ద శనివారం రాత్రి 8.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన అజార్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఆజార్ ను ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు .కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ వెల్లడించారు.