పట్టణంలోనిCPIML లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో, ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
నంద్యాల జిల్లా నందికొట్కూరులో పట్టణంలోని సి.పి.ఐ.(ఎం.ఎల్.) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం నిర్వహించారు,ఈ కార్యక్రమం ప్రజా ఉద్యమ వేదికగా, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచింది,ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గుజ్జుల గౌరీశ్వర నాయుడు, సామాజిక సేవకులు, నందికొట్కూరు హాజరై ప్రసంగించారు,ఆయన మాట్లాడుతూ, యేసు క్రీస్తు బోధనలు రాజుల పక్షాన కాకుండా పేదలు, అణచివేయబడిన వర్గాల పక్షాన నిలబడిన విప్లవాత్మక మార్గమని పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం, అణచివేతకు గురైన వారికి ధైర్యం, నలిగిన వర్గాలకు న్యాయం చేయాలన్న యేసు సందేశమే ఈ రోజు ప్రజా ఉద్యమాలకు దిశాన