జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను కలిసిన సువర్ణ దుర్గ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు
సువర్ణ దుర్గ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో శ్రీ రామ చంద్ర కళ్యాణ వేదిక ధరూర్ క్యాంప్ లో నవమ శ్రీ దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈసందర్బంగా శ్రీ దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను మంగళవారం మధ్యాహ్నం 4-30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను వారి నివాసంలో కలిసి అందజేసి ఆహ్వానించారు.