అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రూరల్ మండల పరిధిలో ఉన్న ఆలూరు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ కు చెందిన అనిత అనే కార్మికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వేజనా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.