అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని లచ్చానుపల్లి రోడ్డులో అద్భుత కుమార్ చర్చి శాల వద్ద గుర్తుతెలియని సుమారు 50 సంవత్సరాలు వయస్సు ఉన్న ఓ వ్యక్తి మృతి చెందాడని ఎవరైనా అతడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఆదివారం గుత్తి సీఐ రామారావు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని లచ్చానుపల్లి రోడ్డులో ఉన్న శాలకు ఈ నెల 25న క్రిస్మస్ ప్రార్థనలకు శాల చర్చికి ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. అదే రోజు శాలలో మూర్చ వ్యాధి వచ్చి పడిపోయాడు. గమనించిన స్థానికులు, చర్చి వలంటీర్లు 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.