అనపర్తి: చినపొలమూరులో ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం, 340 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసిన వైద్యాధికారులు
ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీహెచ్సీ వైద్యాధికారిని డాక్టర్ సుమతి, డాక్టర్ మీనాక్షి అన్నారు. అనపర్తి మండలం చినపొలమూరులో మంగళవారం ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో 340 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డా.రమ్య, డా.స్ఫూర్తి, డా.జ్యోతిర్మయి,పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి తదితరులు పాల్గన్నారు.