రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని ప్రధాన ఉద్దేశంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా వైసీపీ శ్రేణులు కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం యాడికి మండల కేంద్రంతో పాటు గుడిపాడు గ్రామంలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొంబాయి రమేష్ నాయుడు, సర్పంచ్ సావిత్రి ఆధ్వర్యంలో కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొంబాయి రమేష్ నాయుడు మాట్లాడారు. కూటమి సర్కార్ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నదన్నారు. అడ్డుకొని తీరుతామన్నారు.