ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులలో తరలిస్తున్న జంతువుల మాంసాన్ని స్థానిక పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇవి గోవులకు సంబంధించిన మాంసం అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వెటర్నరీ అధికారితో మాంసాన్ని పరీక్షించేందుకు ల్యాబ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని మాంసాన్ని విశాఖపట్నం గుంటూరు నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.