మచిలీపట్నం: ఇంటింటికి తాపాళా సేవలు.. నగరంలోని పలు కూడళ్లలో తపాలా సేవలపై ప్రచారం చేసిన ఉద్యోగులు
భారత ప్రభుత్వ తపాలా శాఖ అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేసేందుకు 100 రోజులపాటు ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పోస్టల్ అందిస్తున్న వివిధ పథకాలు వివరించే కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మచిలీపట్నం ప్రధాన కూడలలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. పోస్టల్ అందిస్తున్న తపాలా జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) గ్రామీణ తపాలా బీమా సంరక్షణ మరియు శ్రేయస్ కొరకు తక్కువ ప్రీమియం మరియు ఎక్కువ బోనస్ పొందే అవకాశాలను ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రజలకు వివరించారు.