రాయదుర్గం: రాయంపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన మున్సిపల్ వర్కర్
రాయదుర్గం మండలం రాయంపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం రాత్రి ఈసంఘటన చోటు చేసుకుంది. నేత్రపల్లి కి చెందిన నాగేష్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తూ రాయదుర్గం పట్టణం బిటిపి రోడ్డులో నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం బైక్ పై స్వగ్రామం నేత్రపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.