శ్రీకాకుళం: రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని వేళలా కృషి చేస్తుందన్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని వేళలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధవారం కొత్తూరు హిరమండలాలను కలుపుతూ నిర్మిస్తున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పనులకు గాను నాబార్డ్ నిధులు రూ. 2.80 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ఈ పనులను త్వరితగతిన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.