శ్రీకాకుళం: కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాల్లో శోభాయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలను జండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్
కోటబొమ్మాళి, కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్ర భక్తులకు కనువిందుగ జరిగింది. కొత్త పేట కూడలి నుంచి కోటబొమ్మాళి వరకు అంగరంగ వైభవంగా సాగింది. కళాకారుల నృత్యాలు, గ్రామీణ సాంస్కృతిక కళలు అందరినీ అలరించాయి.శోభయాత్ర జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సతీమణి కింజరాపు విజయ మాధవి,జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ విజయ ఢంకా మోగించారు.పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సతీ సమేతంగా కొత్తమ్మ తల్లిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.