మహిళ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తి అరెస్టు చిత్తూరు-యాదమరి మండలం పాచిగుంట గ్రామానికి చెందిన కీర్తన అను వివాహత 2024వ సంవత్సరం డిసెంబరు నెల 11వ తేదీ గ్రామ శివారులో బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అదే గ్రామానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి ఆమెను మానసికంగా వేధించడం వలన ఆత్మహత్య చేసుకున్నదని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగింది. అప్పటి నుండి సదరు వసంత్ కుమార్ అనే వ్యక్తి తప్పించుకొని తిరుగుతూ ఉండగా శుక్రవారం అతనిని ఓటేరుపల్లి క్రాస్ దగ్గర అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్సై ఈశ్వర్ తెలిపారు.