తాడిపత్రిలోని అయాన్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ట్యూబ్ లైట్స్ బ్రేకింగ్ స్టంట్ విజయవంతమైంది. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్- 100 ట్యూబ్ లైట్స్ బ్రేకింగ్ స్టంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి యశస్వి భారతి చూపించిన అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మానసిక ఏకాగ్రతతో ట్యూబ్ లైట్స్ బ్రేకింగ్ స్టంట్ చేసి అందరినీ మెప్పించింది. కార్యక్రమంలో టైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షులు శివయ్య, తాడిపత్రి రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు