అనంతలో ఉధృతమైన సమైక్యాంధ్ర తరహా ఉద్యమం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
అనంతపురం జిల్లా ప్రస్తుతం అట్టుడికి పోతోంది. అనంతపురం జిల్లాకు గుండె చప్పుడుగా ఉన్న ఆర్డిటి సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ చేయాలంటూ ఫారిన్ నుంచి వస్తున్న నిధులను కేంద్రం ఆపి జిల్లాను అంధకారంలో నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందంటూ అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట మరో సమైక్యాంధ్ర తరహా ఉద్యమం ఉదృతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా తమ నిరసనలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మోడీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ద్రోహులుగా మిగిలిపోతారు అంటూ నినాదాలు చేశారు.