కొత్తగూడెం: స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ఐదు రోజుల కార్యచరణ పాటించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
స్వచ్ఛ సర్వేక్షన్ 2025లో భాగంగా గ్రామాల పరిశుభ్రతను పెంపొందించేందుకు ఐదు రోజుల కార్యచరణ అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు స్వచ్ఛ సర్వేక్షన్ పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.