మెదక్: పీఏసీఎస్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు
Medak, Medak | Sep 16, 2025 పీఏసీఎస్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు మెదక్ జిల్లా రామాయంపేట లోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు మంగళవారం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. యూరియా లారీ వచ్చిన విషయం తెలిసి ఉదయం నాలుగు గంటల నుంచే వారు క్యూలో నిలబడ్డారు. గత 15 రోజులుగా యూరియా సరఫరా లేకపోవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరిపడా యూరియాను వెంటనే సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.