మేడ్చల్: ఉప్పల్ మినీ శిల్పారామం నుండి విచ్చేసి యాదిరిగుట్ట మినీ శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ మిని శిల్పారామం నుండి విచ్చేసిన రాధా నృత్య నిలయం గురువర్యులు శ్రీమతి రాధా మోహన్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. నర్తన గణపతిమ్, పలుకే బంగారమాయెనా,నమో నమో లక్ష్మి నరసింహ, కాలభైరవాష్టకం, రామ్ రామ , సత్యం భగవత్ స్వరూపం, హరివారసనం, చంద్రశేఖరాష్టకం, తిల్లాన అంశాలను కళాకారులూ భవిక, సమీక్ష, తపస్వి ప్రదర్శించి, మెప్పించారు.