నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో ఆదివారం సాయంత్రం 30 ఎకరాల్లో పంట దగ్ధమైంది, స్థానికుల వివరాల మేరకు వడ్డేమాన్ గ్రామానికి చెందిన రైతు సోమన్న మొక్కజొన్న కోత తర్వాత చెత్తకు నిప్పు పెట్టాడు, ఆ మంటలు పక్క పొలాలకు వ్యాపించాయి, రైతులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన మంటలు అదుపులోకి రాలేదు దీంతో 30 ఎకరాల్లో మొక్కజొన్న కంది పంట పూర్తిగా దగ్ధమైంది, బ్రాహ్మణ కొట్టుకూరు ఎస్సై తిరుపాలు దగ్ధమైన పంటను పరిశీలించారు రైతుల ఫిర్యాదులతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు