అనంతపురం నగర శివారులోని ఇంటెల్ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట వేప చెట్టుకు అనంతపురం నగరంలోని నందమూరి నగర్ కు చెందిన కామేశ్వర గౌడ్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న అతను కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్రమనస్తపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.