ముక్కంటి ఆలయంలో రేపు జరుగు కేదారి గౌరీ వ్రత ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు
శ్రీకాళహస్తిలో కేదారి గౌరీవ్రత ఏర్పాట్లు.! శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దీపావళి సందర్భంగా సామూహిక కేదారి గౌరీ వ్రతం నిర్వహిస్తారు. అందులో భాగంగా మంగళవారం ఆలయ ఆవరణంలోని బ్రహ్మగుడి వద్ద భక్తుల కోసం పందిళ్లు వంటివి ఏర్పాట్లకు ఆలయ అధికారులు సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఈ సామూహిక వ్రత పూజలు ప్రారంభమవుతాయి. ఈ నోములు నిర్వహించుకోవడానికి శ్రీకాళహస్తి, పరిసర గ్రామీణ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు.