మేడ్చల్: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మంగళవారం రోజున జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మాగంటి సునీతమ్మ భారీ విజయం సాధిస్తారని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం భాగంగా సోమాజిగూడ డివిజన్లోని అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన ఉపఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో ప్రజల ఆశీర్వాదంతో మాగంటి సునీత భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.