నెల్లూరు జిల్లాలో నేర నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కౌన్సిలింగ్ నిర్వహించారు. స్టేషన్ పరిధిలో ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. తోక జాడిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.