వరుసకు కూతురయ్యే అమ్మాయి పట్ల బాబాయ్ వికృత చేష్టలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామన్న ఎస్ఐ రాజేష్
పెనుగొండ మండలం అమ్మవారిపల్లికి చెందిన వెంకటరెడ్డి వరుసకు కూతురు అయ్యే యువతికి అసభ్యకర మెసేజ్ లు పెట్టడంపై కేసు నమోదు చేసినట్లు కియా పోలీస్ స్టేషన్ ఎస్సై రాజేశ్ బుధవారం తెలిపారు. ఈ మేరకు యువతి ఫిర్యాదు చేసిందని చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేశారు.