ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రైవేటు కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్టేజిపై పలు సినిమా పాటల కోసం స్టెప్పులు వేస్తూ ఆనందపరిచారు దాంతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా స్టేజి పైకి వెళ్లి కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు మరియు యాజమాన్యంతో కలిసి సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ ఉత్సాహపరిచారు. ఒక్కసారిగా ఎంపీ స్టేజి పైకి వెళ్లి స్టెప్పులు వేయడంతో కళాశాల ప్రాంగణం మొత్తం కేరింతలతో ఆనందోత్సవాలతో నడిచింది