ఆదోని: ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం : ఎస్ఎఫ్ఐ
Adoni, Kurnool | Sep 15, 2025 ఆదోని పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రంగప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు సోమవారం తెలిపారు. ఆదోని పట్టణంలోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రహదారిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేటీకరణ చేస్తే వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు.