బీసీ రిజర్వేషన్లపై కేంద్రం మోసం చేసింది: కవిత తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఘన స్వాగతం లభించింది. హైదరాబాదు నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట చేరుకున్న ఆమెను అభిమానులు, కార్యకర్తలు శాలవాలతో సత్కరించి స్వాగతం పలికారు. కవిత మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.